డీజీపీ తన టోపీపై ఉన్న మూడు సింహాలను తాడేపల్లి ప్యాలెస్‌లో తాకట్టు పెట్టొద్దంటూ తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. ఎస్సీ వర్గానికి చెందిన రామచంద్రపై జరిగిన దాడికి సంబంధించి చంద్రబాబు లేఖ రాయటమే తప్పన్నట్లుగా డీజీపీ ప్రత్యుత్తరం పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆధారం లేకుండా తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్న వైకాపా నేతలకు డీజీపీ ఈ తరహా లేఖలు ఎందుకు రాయలేదని నిలదీశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టిన మంత్రి కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
'మూడు సింహాలను తాడేపల్లి ప్యాలెస్‌లో తాకట్టు పెట్టొద్దు' - డీజీపీపై కొమ్మారెడ్డి పట్టాభి వ్యాఖ్యలు
డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఘాటు విమర్శలు చేశారు. రామచంద్రపై జరిగిన దాడిపై చంద్రబాబు లేఖ రాయటమే తప్పన్నట్లుగా డీజీపీ ప్రత్యుత్తరం పంపారన్నారు.
కొమ్మారెడ్డి పట్టాభి
ఇదీ చదవండి: న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి: చంద్రబాబుకు డీజీపీ లేఖ