ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మద్య నిషేధం పేరిట.. దశలవారీ దోపిడీకి శ్రీకారం' - మద్యనిషేధం పేరిట దశలవారీ దోపిడీకి శ్రీకారం

దశలవారీ మద్య నిషేధం పేరిట దశలవారీ దోపిడీకి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెదేపా అధికారి ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. మద్య నిషేధం నాటకమన్న ఆమె... మద్యం మాఫియాను పోషించేందుకే నూతన విధానాలని విమర్శించారు.

మద్యనిషేధం పేరిట దశలవారీ దోపిడీకి శ్రీకారం : పంచుమర్తి అనురాధ

By

Published : Oct 1, 2019, 5:45 PM IST

మద్యనిషేధం పేరిట దశలవారీ దోపిడీకి శ్రీకారం : పంచుమర్తి అనురాధ
మద్య నిషేధం ముసుగులో జె-టాక్స్ పేరిట రూ.2 వేల కోట్ల దోపిడీకి జగన్‌ శ్రీకారం చుట్టారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అమరావతిలో మాట్లాడిన ఆమె.. ప్రభుత్వం అమలు చేస్తోన్న మద్యపాన నిషేధం ఓ నాటకమని విమర్శించారు. పులివెందులలో మద్యం ఏరులై పారుతోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో 20శాతం మద్యం దుకాణాలు తగ్గించామని ప్రభుత్వం చెప్పటం హాస్యాస్పదమన్నారు. మద్యం మాఫియాను పెంచి పోషించేలా సర్కారు చర్యలు ఉన్నాయని అనురాధ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ బ్రాండ్ మద్యం అమ్మాలో కేసీఆర్​ని అడిగి జగన్ నిర్ణయిస్తారని ఎద్దేవా చేశారు. దశలవారీగా మద్య నిషేధం పేరిట దశలవారీగా దోచుకునేందుకు ప్రణాళికలు చేసుకున్నారని ఆమె మండిపడ్డారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details