వైకాపాపై తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి సీఎంను వారి వద్ద ఉంచుకుని.. తెదేపాపై లేనిపోని నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఐటీ దాడులు జరిగితే.. దానికి తెదేపాకు సంబంధమేంటని ప్రశ్నించారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వారు తమపై నిందలు వేయటం హాస్యాస్పదమని అన్నారు. జగన్ అవినీతి కేసులపై వైకాపా నేతలు బహిరంగ చర్చకు రావాలని ఆమె సవాల్ విసిరారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే.. 87 శాతం మంది వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి కేసుల్లో ఉన్నవారేనని ఆరోపించారు.
జగన్ కేసులపై వైకాపా నేతలు చర్చకు సిద్ధమా? - tdp leader anuradha fire on ys jagan over it Raids news
జగన్ అక్రమాస్తుల కేసులపై వైకాపా నేతలు బహిరంగ చర్చకు రావాలని తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధ సవాల్ విసిరారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుపై ఎలాంటి అవినీతి మచ్చ లేదన్నారు.
tdp official spokes person Panchumarti anuradha comments on it Raids