రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్కు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షన్నర స్వర్ణకారులు ఉన్నారని.. వీరంతా బంగారు నగల డిజైనింగ్నే వృత్తిగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా వీరు ఉపాధి కోల్పోయారని అన్నారు. బంగారు నగలు చేసేటప్పుడు వాడే రసాయనాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా వారు సరైన వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వీరి జీవన భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
స్వర్ణకారులను ఆదుకోవాలని సీఎంకు లోకేశ్ లేఖ - tdp leaders letters to cm news
రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న విశ్వ బ్రాహ్మణులను ఆదుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. వారి జీవన భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
స్వర్ణకారులను ఆదుకోవాలని సీఎంకు లోకేశ్ లేఖ