ప్రపంచానికి ప్రేమ, సహనం, త్యాగం, క్షమాగుణం క్రీస్తు ఇచ్చిన సందేశాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలందరికీ ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదరులందరిలో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. పేదలకు సేవ చేయడం ద్వారానే మనుషుల్లో మానవత్వం, సోదరభావం పెంపొందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. క్రీస్తు జన్మదినం ఎంతో పవిత్రమన్న తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్... క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 9 గంటలకు బెంజ్ సర్కిల్ సమీపంలోని నిర్మలా కాన్వెంట్ చర్చికి వెళ్లనున్న చoద్రబాబు... అక్కడ నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో పాల్గోనున్నారు.
'క్రిస్మస్ ప్రజలందరిలో సంతోషం నింపాలి' - babu christmas wishes to telugu people
ఈ క్రిస్మస్ క్రైస్తవ సోదరులందరిలో సంతోషం నింపాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.
'క్రిస్మస్ ప్రజలందరిలో సంతోషం నింపాలి'