ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా లెక్కలు ఉత్తరాంధ్ర పర్యటనలో తేలుస్తా: చంద్రబాబు - Tdp national president chandrababu tour in north andhra

వైకాపా నేతల లెక్క తేలుస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనకు బయల్దేరే ముందు పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ చేశారు.

chandrababu teleconference
chandrababu teleconference

By

Published : Feb 27, 2020, 10:24 AM IST

ఉత్తరాంధ్ర పర్యటనకు తెదేపా అధినేత చంద్రబాబు బయల్దేరారు. ఈ నేపథ్యంలో.. పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ చేశారు. వైకాపా లెక్కలను ఉత్తరాంధ్ర పర్యటనలో తేల్చుతానని వ్యాఖ్యానించారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన వైకాపాకు... తెదేపాను ప్రశ్నించే నైతిక అర్హత లేదన్నారు. పర్యటనకు వస్తుంటే వీర్రాజు చెరువు వద్ద రోడ్డు తవ్వకం సరికాదని చెప్పారు. తన పర్యటనకు ఆంక్షలు పెట్టడం కాదని.. రోడ్లు తవ్వుతున్న వారి సంగతి చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రోడ్లు తవ్వినా, ప్రొక్లెయినర్లు అడ్డుపెట్టినా పర్యటన ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యటనకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డుతోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details