మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. పలు గ్రామాల్లో రాజకీయ వివాదాలకు తెరపడటం లేదు. కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామలో వైకాపా మద్దతుదారులు.. తెలుగుదేశం నేతలపై కర్రలతో దాడి చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. అధికార పార్టీ నేతలు తమను బెదిరిస్తున్నారంటూ తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా.. శింగనమల మండలం నాగుల గుడ్డంతాండా సర్పంచ్‌గా గెలిచిన లక్ష్మీదేవి ఇంటిపై వైకాపా శ్రేణులు దాడి చేశాయని.. తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో, తెదేపా గెలుపును జీర్ణించుకోలేక దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
రీపోలింగ్ లేదా రీకౌంటింగ్..
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పులికొండ, మారెళ్లలో రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ నిర్వహించాలంటూ.. తెదేపా నేతలు డిమాండ్ చేశారు. తమ పార్టీ మద్దతుదారులకు ఆధిక్యం వస్తే అధికార పార్టీ ఒత్తిళ్లతో ఫలితాలు తారుమారు చేశారని కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దాం..