రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా వైకాపా నేతలు అధికారులను బెదిరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడారని చంద్రబాబు అన్నారు.
ఎస్సై ఉదయ్‌బాబు ఏకపక్షం..
ప.గో.జిల్లా ఎస్.ముప్పవరంలో రీకౌంటింగ్ జరిపించాలని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కుంకులగుంటలో పోలీసుల తీరుపై ఆక్షేపణీయమన్నారు. ఎస్సై ఉదయ్‌బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు.. పోలింగ్ కేంద్రాల్లో తెలుగుదేశం అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎస్సై ఉదయ్‌బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిమ్మగడ్డకు మరో లేఖ..
పలు కేంద్రాల్లో ఫలితాల నిలుపుదలపై ఎస్‌ఈసీకి చంద్రబాబు మరో లేఖ సంధించారు. తెదేపా మద్దతుదారులు గెలిచిన పంచాయతీల్లో ఫలితాలు నిలుపుదలపై లేఖలో వివరించారు. తక్షణమే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఫలితాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా తుమ్మచర్ల, పాతపాలెం ఫలితాలు విడుదల చేయలని కోరారు. కృష్ణా జిల్లా పోలుగొండలో ఫలితం విడుదల చేయాలన్నారు. ప్రకాశం జిల్లా అయ్యప్పరాజు పంచాయతీ ఫలితం విడుదల చేయాలని సైతం లేఖలో ప్రస్తావించారు.
ఫలితాలు వెంటనే వచ్చేలా చూడండి : తెదేపా అధినేత
చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టీ.సదుం, కరుబకోట మండలం కడప క్రాస్ పంచాయతీ, గుర్రంకొండ మండలం చర్లోపల్లి, అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తొగరకుంట, రాప్తాడు మండలం బోగినేపల్లి, పశ్చిమగోదావరి దేవరపల్లి మండలం కురుకూరు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని గొట్టిపాడు పంచాయతీ ఎన్నికల ఫలితాలను వెల్లడించలేదని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జోక్యం చేసుకుని వెంటనే ఫలితాలు విడుదలయ్యేలా చూడాలని ఆదేశించాలని కోరారు.
ఇదీచదవండి.