ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NARA LOKESH: 'మూడు జన్మలెత్తినా.. మూడు రాజధానులు కట్టలేరు..!'

జ‌గ‌న్‌రెడ్డి, ఆయ‌న మంత్రులు మ‌రో మూడు జ‌న్మలెత్తినా.. మూడు రాజ‌ధానులు క‌ట్టలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం 700 రోజులకు చేరిందని.. వారి విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.

Tdp National General Secretary Nara Lokesh speaks about amaravathi farmers protest
'మూడు జన్మలెత్తినా.. మూడు రాజధానులు కట్టలేరు..!'

By

Published : Nov 16, 2021, 2:04 PM IST

జ‌గ‌న్‌రెడ్డి, ఆయ‌న మంత్రులు మ‌రో మూడు జ‌న్మలెత్తినా మూడు రాజ‌ధానులు క‌ట్టలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజారాజ‌ధానిపై.. ప్రభుత్వాధినేత‌ జ‌గ‌న్‌రెడ్డి చేస్తున్న విద్వేష‌పు కుట్రల‌కు వ్యతిరేకంగా అమ‌రావ‌తి రైతులు, కూలీల‌ చేస్తున్న పోరాటం 700 రోజుల‌కు చేరిందన్నారు. కేవలం 30 వేల మంది రైతుల స‌మ‌స్యగా.. చిన్నచూపు చూసిన పాల‌కుల క‌ళ్లు బైర్లు క‌మ్మేలా.. కోట్లాది మంది రాష్ట్ర ప్రజ‌లు మ‌ద్దతుగా నిలిచారని నారా లోకేశ్ కొనియాడారు. అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన‌ న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం మహాపాద‌యాత్ర జ‌న‌సంద్రాన్ని త‌ల‌పిస్తోందని అన్నారు.

ప్రజారాజ‌ధాని కోసం భూములు, ప్రాణాలు తృణ‌ప్రాయంగా రైతులు చేసిన త్యాగం నిరుప‌యోగం కాబోదని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమ‌రావ‌తి కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజ‌ల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. అమ‌రావతి వైపు న్యాయం ఉందని.. కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కతీతంగా ప్రజ‌లు, రాజ‌కీయ పార్టీల‌ మ‌ద్దతు ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒకే రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్రమే ఉండాలన్నారు.

ఇదీ చూడండి:CM JAGAN: గులాబ్‌ తుపాను బాధిత రైతులకు రూ.22 కోట్లు

ABOUT THE AUTHOR

...view details