Nara Lokesh: 'గుడ్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి' అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై వైకాపా ప్రభుత్వం చేసిన ఖర్చు తక్కువే అంటూ ఈఎన్సీ నారాయణరెడ్డి ప్రకటనను తన ట్వీట్‌కు జత చేసి ప్రశ్నస్త్రాలు సంధించారు. ఈఎన్సీ దెబ్బకి ఉదయాన్నే జగన్ గూబ గుయ్యిమని ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కు వైకాపా నేతలకు లేదని వారి ప్రభుత్వమే ప్రకటించడం దేవుడి స్క్రిప్ట్ అని పేర్కొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలిసిన వైకాపాకు ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడటం సెల్ఫ్ గోల్ వేసుకోవడమేనని విమర్శించారు.
Nara Lokesh: ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ - ఏపీ తాజా వార్తలు
Nara Lokesh: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'గుడ్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి' అంటూ ట్వీట్ మొదలుపెట్టి తర్వాత ఏం అన్నారంటే..?
నారా లోకేశ్