వైకాపా నాయకులు.. తమ విరుద్ధ ప్రవర్తనతో పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 3,4వ దశ పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. 92శాతం పంచాయతీల్లో తామే గెలిచామంటూ.. వైకాపా నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఏం చేసినా వాస్తవం దాగదని అన్నారు. ఓట్లు వేయలేదని ఇల్లు, డ్రైనేజ్, మెట్లు పగలగొట్టటం, సంక్షేమ పథకాలు రద్దు చేయటం, దాడులు చేయటం దారుణమని పేర్కొన్నారు.
ఓట్లు వేయకపోతే ఆస్తులు ధ్వంసం చేస్తారా..?
వైకాపా నాయకులు.. తమ వికృత చేష్టలతో పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఆలస్యంగా అయినా ఫ్యాక్షన్ పంథాలో సీఎం జగన్ ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు.
ఓట్లు వేయకపోతే ఆస్తులు కూలుస్తారా