తప్పు తప్పించుకునే క్రమంలో తన తప్పులు బయటపెట్టే గొప్పతనం సీఎం జగన్‌ది అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జీవో నెం. 42 సరిగా చదవలేదు... 2 కాదు 3 ఆప్షన్లు ఇచ్చామన్నారని విమర్శించారు. ఇప్పుడు మరో 2 ఆప్షన్లంటూ మెమో జారీచేసి అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. ఇప్పటికైనా ఆప్షన్ల నాటకాన్ని జగన్ మానుకోవాలిని లోకేశ్ హితవు పలికారు. కుట్రతో తీసుకొచ్చిన జీవో 42, 50, 51, 19లను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
NARA LOKESH: 'ఇప్పటికైనా ఆప్షన్ల నాటకాన్ని జగన్ మానుకోవాలి' - ఏపీ తాజా రాజకీయ వార్తలు
ఇప్పటికైనా సీఎం జగన్ ఆప్షన్ల నాటకాన్ని మానుకోవాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కుట్రతో తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరారు.
'ఇప్పటికైనా ఆప్షన్ల నాటకాన్ని జగన్ మానుకోవాలి'