Nara Lokesh: వైయస్ వివేకానందరెడ్డి హత్యతో ఎలాంటి సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. వివేకా హత్య విషయంలో తమ కుటుంబంపై జగన్ బ్యాచ్ ఆరోపణలను ఖండిస్తూ.. వేంకటేశ్వర స్వామి సమక్షంలో గతేడాది తాను ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. బాబాయ్ హత్యతో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణానికి సీఎం జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. ఒకవేళ ప్రమాణం చేయకపోతే.. గొడ్డలి పోటు జగనాసుర రక్తచరిత్ర అని అంగీకరిస్తారా అని నిలదీశారు.
శ్రీవారి సాక్షిగా ప్రమాణానికి జగన్ రెడ్డి సిద్ధమా: నారా లోకేశ్ - జగన్ రెడ్డి
Nara Lokesh Challenge to YS Jagan: వివేకా హత్య కేసులో సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. తన కుటుంబానికి వివేకా హత్య కేసు సంబంధం లేదని గతంలో తాను ప్రమాణం చేసిన విషయాన్ని లోకేశ్ గుర్తు చేశారు. హత్య కేసులో సంబంధం లేదని సీఎం జగన్ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.
నారా లోకేశ్