ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విభజన నష్టం కంటే... జగన్ పాలనతోనే ఎక్కువ సమస్యలు' - వైకాపా పాలనపై తెదేపా ఎంపీలు

ఐదునెలల్లో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జోక్యం కోరాలని తీర్మానించినట్లు తెదేపా ఎంపీలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించినట్లు నేతలు తెలిపారు.

రాష్ట్ర సమస్యలపై తెదేపా ఎంపీలు

By

Published : Nov 15, 2019, 4:07 PM IST

రాష్ట్రంలో అమలవుతున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్ ద్వారా దేశ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. చంద్రబాబు నివాసంలో ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించినట్లు నేతలు వెల్లడించారు. ఐదు నెలల్లో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జోక్యం కోరాలని తీర్మానించినట్లు చెప్పారు.

మాతృభాష కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని ఎంపీ రామ్మోహన్​నాయుడు అన్నారు . రాష్ట్రం విడిపోయినప్పటి నష్టం కంటే జగన్ పాలనలో నష్టమే ఎక్కువ ఉందని కనకమేడల రవీంద్రకుమార్​ అన్నారు. రివర్స్ టెండరింగ్‌, మీడియాపై ఆంక్షలు, ఇతర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీ గల్లా జయదేవ్​ అన్నారు.

రాష్ట్ర సమస్యలపై తెదేపా ఎంపీల

ABOUT THE AUTHOR

...view details