ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. రాష్ట్రపతికి, కేంద్రానికి తెదేపా ఫిర్యాదు - tdp mps complaint to prsident on ycp government ruling news

రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తెదేపా ఎంపీలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్రమంత్రి నరేంద్రసింగ్​ తోమర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో నరేగా నిధులు మళ్లించారని.. రూ.2 వేల కోట్లు అధికార దుర్వినియోగం చేశారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రపతి, కేంద్రమంత్రిని కలిసిన తెదేపా ఎంపీలు
రాష్ట్రపతి, కేంద్రమంత్రిని కలిసిన తెదేపా ఎంపీలు

By

Published : Jul 16, 2020, 3:39 PM IST

రాష్ట్రప్రభుత్వ విధానాలపై తెదేపా ఎంపీల ఫిర్యాదు

'అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం' అని తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో తెదేపా ఎంపీలు.... కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని భేటీ అయ్యారు. తాము చెప్పిన విషయాలను రాష్ట్రపతి సావధానంగా విన్నారని.... తన పరిధిలో తీసుకోగలిగే చర్యలను పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.

కేంద్ర మంత్రికి ఫిర్యాదు

ఏపీలో నరేగా నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందంటూ తెలుగుదేశం ఎంపీలు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం... తోమర్‌ను కలిసిన ఎంపీలు.... తెదేపా హయాంలో జరిగిన ఉపాధి పనులకు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చెల్లింపులు నిలిపివేసిందని ఆరోపించారు.

గ్రామాల్లో చిన్న గుత్తేదార్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తోందని చెప్పారు. కేంద్రం అనేక లేఖలు రాసినా ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని మంత్రికి వివరించారు. వీటన్నింటినీ విన్న మంత్రి... తగిన విధంగా స్పందించేందుకు సానుకూలత వ్యక్తం చేశారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

ఇదీ చూడండి:

వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ... ఏడు జిల్లాల్లో అమలు

ABOUT THE AUTHOR

...view details