తెదేపా ఎంపీలు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను దిల్లీలో కలిశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు అంశంపై ఎంపీలు కేంద్రమంత్రికి వివరించారు. బిల్లులు చెల్లించకుండా ఏడాదిగా జాప్యం చేస్తున్నట్లు కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ సమయంలో ఉపాధి హామీ పనులు చేయించిన సర్పంచులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారని నరేంద్రసింగ్ తోమర్‌కు తెలిపారు.
కేంద్రమంత్రులతో తెదేపా ఎంపీల భేటీ... - కేంద్రమంత్రులతో టీడీపీ ఎంపీలు సమావేశం
రాష్ట్రంలోని సమస్యలను తెలిపేందుకు తెదేపా ఎంపీలు దిల్లీలో కేంద్రమంత్రులను కలిశారు. కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, హర్దీప్‌సింగ్ పూరీలను తెదేపా ఎంపీలు కలిశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులు, గృహ నిర్మాణ పథకం ఇళ్లు కేటాయింపుపై కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు.
కేంద్రమంత్రులతో తెదేపా ఎంపీల భేటీ
కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరీని దిల్లీలో తెదేపా ఎంపీలు కలిశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏపీలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయలేదని కేంద్రమంత్రికి తెలిపారు.
ఇదీ చదవండి :రాజధాని అంశంపై సీఎంకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి అథవాలే
Last Updated : Sep 24, 2020, 5:11 PM IST