ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP MPs Fires on YSRC MPs: 'వైకాపా ఎంపీలు పార్లమెంటు సాక్షిగా.. రాష్ట్రం పరువు తీశారు' - YCP MPs

TDP MPs Fires on YSRC MPs: వైకాపా ఎంపీల తీరుపై తెదేపా పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ రెండున్నరేళ్లలో ప్రత్యేక హోదా కోసం ఒక్క పోరాటమైనా చేశారా..? అని ప్రశ్నించారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందంటూ.. పరువు తీశారని ఎంపీ కనకమేడల మండిపడ్డారు.

TDP MPs
TDP MPs Fires on YCP MPs

By

Published : Dec 2, 2021, 4:38 PM IST

Kanakamedala Fires On YCP MPs: పార్లమెంట్ సాక్షిగా.. వైకాపా నేతలు రాష్ట్రం పరువుతీశారని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉందంటూ చెప్పి.. రాష్ట్ర ఖ్యాతిని భ్రష్టుపట్టించారని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్ర ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు.

mp rammohan naidu slams YSRC MPs: అధికార వైకాపా నేతలు ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తున్నారని ఎంపీ రామ్మోహన్‌ ప్రశ్నించారు. హోదా కోసం రెండున్నరేళ్లలో ఒక్క పోరాటమైనా చేశారా? అని నిలదీశారు. తెరాస ఎంపీలు తక్కువమంది ఉన్నా పోరాడుతున్నారని.. వైకాపా ఎంపీలు మాత్రం నోరు మెదపట్లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించట్లేదని నిగ్గదీశారు. చిత్తశుద్ధి ఉంటే వైకాపా నేతలు దిల్లీలో పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.

'హోదా కోసం రెండున్నరేళ్లలో ఒక్క పోరాటమైనా చేశారా? తెరాస ఎంపీలు తక్కువమంది ఉన్నా పోరాడుతున్నారు. వైకాపా ఎంపీలు మాత్రం నోరు మెదపట్లేదు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించట్లేదు..? చిత్తశుద్ధి ఉంటే వైకాపా నేతలు దిల్లీలో పోరాటం చేయాలి' - ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఇదీ చదవండి:

weather forecast: మరింత బలపడిన అల్పపీడనం.. సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం

ABOUT THE AUTHOR

...view details