కేంద్రం నుంచి రూపాయి తెచ్చుకోలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని తెదేపా ఎంపీలు మండిపడ్డారు. హోదా గురించి వైకాపా ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. లేఖలతో ప్రత్యేక హోదా రాదని, రాజీనామాలు చేయాలని గతంలో చెప్పిన జగన్.. ఇప్పుడెందుకు ముందుకు రారని తెలుగుదేశం ఎంపీలు నిలదీశారు. రాజధాని మార్పులపై లోక్‌సభలో తాము అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. వైకాపా ఎంపీలు అడ్డు తగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఎలా తెస్తారనే విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని గతంలో చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రధాని, కేంద్ర మంత్రులని గట్టిగా అడగండని వైకాపా ఎంపీలకు సూచించారు. హోదా గురించి పోరాటం చేస్తే తాము కూడా మద్దతిస్తామని స్పష్టం చేశారు.
రామ్మోహన్ నాయుడు సవాల్