ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్​హెచ్​ఆర్​సీలో తెదేపా ఎంపీల ఫిర్యాదు - తెదేపా శ్రేణులపై దాడులు

తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతల బృందం జాతీయ మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేసింది. గల్లా జయదేవ్, కనకమేడల రవింద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, సీతారామలక్ష్మీ, ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా పలువురు దిల్లీలోని ఎన్​హెచ్​ఆర్​సీ కార్యాలయంలో... జస్టిస్ హెచ్​ఎల్ దత్తును కలిసి ఫిర్యాదు చేశారు.

ఎన్​హెచ్​ఆర్​సీలో తెదేపా ఎంపీల ఫిర్యాదు

By

Published : Oct 15, 2019, 5:40 PM IST

ఎన్​హెచ్​ఆర్​సీలో తెదేపా ఎంపీల ఫిర్యాదు

రాష్ట్రంలో తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతల బృందం జాతీయ మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ నేతృత్వంలో ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు, సీతారామలక్ష్మీ, ఎమ్మెల్సీ అశోక్ బాబు సహా పలువురు దిల్లీలోని ఎన్​హెచ్​ఆర్​సీ కార్యాలయంలో... జస్టిస్ హెచ్​ఎల్ దత్తును కలిసి ఫిర్యాదు చేశారు.

తమ ఫిర్యాదుపై ఎన్​హెచ్​ఆర్​సీ ఛైర్మన్ జస్టిస్ దత్తు సానుకూలంగా స్పందించారని ఎంపీలు తెలిపారు. స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని రాష్ట్రానికి పంపించి నివేదిక తెప్పించుకుంటామని చెప్పినట్లు తెదేపా నేతలు వెల్లడించారు. నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని పరిస్థితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు వివరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు మొదలయ్యాయని... వైకాపా దాడుల బాధితులకు చంద్రబాబు అండగా ఉన్నారని కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు.

ఇదీ చదవండీ... పక్క రాష్ట్రంలో రైతన్నల ఇబ్బందులు చూస్తున్నాం!

ABOUT THE AUTHOR

...view details