వైకాపా ఎంపీల తీరుపై తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఎంపీలు మాట్లాడటం లేదన్నారు. శ్రీకాకుళం జీజీహెచ్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్లమెంటులో రకరకాల సమస్యలపై సభ్యులు మాట్లాడుతుంటే.. గుంపులో గోవిందు లాగా వైకాపా ఎంపీలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే తప్ప.. వైకాపాకు చిత్తశుద్ధి లేదన్నారు. వైకాపా ఎంపీలంతా రెండేళ్లుగా ఏం చేశారని ప్రశ్నించారు. ఇన్ని రోజుల తరువాత ఎందుకు నిద్ర లేచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ రఘరామకృష్ణరాజు అంశం కోసం డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. తెదేపా చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.
mp rammohan naidu: రెండేళ్లుగా వైకాపా ఎంపీలంతా ఏం చేశారు..? - parliament monsoon session 2021 updates
రాష్ట్ర సమస్యలపై రెండేళ్లుగా వైకాపా ఎంపీలంతా ఏం చేశారని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే పార్లమెంట్లో ఆందోళనల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.
tdp mp rammohan naidu