విభజన చట్టం అమలు గురించి లోక్సభలో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలన్నీ నెరవేర్చారా? లేదా? అని హోంశాఖ సహాయమంత్రిని అడిగారు. అమలు చేయకుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రస్తావించారు. ఎంపీ ప్రశ్నకు మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక జవాబునిచ్చారు. ఇప్పటికే చాలా అమలు చేశామని.. కొన్ని అమలు దశలో ఉన్నాయని తెలిపారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు, విద్యాసంస్థల ఏర్పాటుకు పదేళ్ల సమయం ఉందని గుర్తు చేశారు. విభజన చట్టం అంశాల అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని.. ఇప్పటివరకు 25 సార్లు భేటీ అయినట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నామని పేర్కొన్నారు.
విభజన చట్టంలోని అంశాలన్నీ నెరవేర్చారా..? లేదా..?: ఎంపీ రామ్మోహన్ నాయుడు - parliament monsoon sessions 2021 news
విభజన చట్టంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రశ్నించారు. చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చారా..? అని అడిగారు. ఇందుకు బదులిచ్చిన కేంద్రహోంశాఖ సహాయమంత్రి.. చాలా అమలు చేశామని తెలిపారు. మరికొన్ని అమలు దశలో ఉన్నాయని చెప్పారు.
tdp mp rammohan naidu