మూడు రాజధానుల నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. 13 జిల్లాలు ఉన్న రాష్ట్రానికి 3 రాజధానులు అంగీకరిస్తే... విభిన్న రాజధానులు కావాలనే డిమాండ్లు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా చూడాలని విన్నవించారు. విభజన చట్టం ప్రకారం ఇప్పటికే అమరావతి రాజధానిగా ఖరారైందని... తన పరిధిలో లేని అంశంపై ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని కనకమేడల లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశం, దుస్సాహసంతో కూడిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఇప్పుడు అడ్డుకోకపోతే... దేశంపై తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుందని లేఖలో ప్రస్తావించారు.
మండలిపై ఆలోచించండి