ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం సహా అవకాశం వచ్చినప్పుడు పార్లమెంటులోనూ చర్చిస్తామని... తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ వెల్లడించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా పార్టీ అధ‍్యక్షుడు చంద్రబాబుతో సమావేశమైన తెదేపా నేతలు... మొత్తం 12 అంశాలపై చర్చించారు. అనంతరం 'ఈటీవీభారత్'తో గల్లా జయదేవ్ ప్రత్యేకంగా మాట్లాడారు. మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం లేదని స్పష్టం చేశారు. రాజధాని వ్యవహారం, మండలి రద్దు అంశాన్ని పార్లమెంట్లో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. అమరావతి ఆందోళనల సందర్భంగా పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును కూడా పార్లమెంటు దృష్టికి తీసుకెళతానని గల్లా జయదేవ్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రివిలేజన్ మోషన్ కింద లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
రాజధాని వ్యవహారంపై పార్లమెంట్లో పోరాడతాం: గల్లా - ఏపీ రాజధాని వార్తలు
రాజధాని అమరావతి, మండలి రద్దు అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. రాజధాని అమరావతి ప్రజల కష్టాలపై గళం విప్పుతామని స్పష్టం చేశారు. మండలి రద్దు అంత సులువు కాదని పేర్కొన్నారు.
tdp mp galla jayadev interview