తమ అబద్ధాలతో వైకాపా నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు, దీపక్‌రెడ్డి ఆరోపించారు. ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశపెట్టాలని తమ పార్టీ సభ్యులు చాలాసార్లు కోరారన్నారు. మంత్రులే సభలో గందరగోళం సృష్టించి బిల్లును అడ్డుకున్నారని పేర్కొన్నారు. తాము బిల్లును అడ్డుకున్నామంటున్న మంత్రి.... సంబంధిత ఫుటేజీని బయటపెట్టాలని సవాల్ విసిరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్ తీసుకురావాలని సూచించారు.
ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశపెట్టాలని చాలాసార్లు కోరాం: తెదేపా ఎమ్మెల్సీలు - ద్రవ్యవినిమయ బిల్లుపై తెదేపా ఎమ్మెల్సీల కామెంట్స్
ద్రవ్యవినిమయ బిల్లును తాము అడ్డుకున్నామనడం సిగ్గుచేటని తెలుగుదేశం ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
tdp-mlcs-on-appropriation-bill