శాసనమండలి రద్దు తీర్మానంతో వైకాపా సర్కార్ పతనానికి పునాది పడిందని తెదేపా ఎమ్మెల్సీలు హెచ్చరించారు. మండలి రద్దు అనేది జరగబోదని ధీమా వ్యక్తం చేశారు.శాసన మండలిని చులకన చేసి మాట్లాడుతున్న సీఎం జగన్కు... రాబోయే రోజుల్లో ఎగువసభ శక్తిని పూర్తిస్థాయిలో చూపిస్తామన్నారు. వైకాపాకు చెందిన వ్యక్తులు ఎమ్మెల్సీలకు ఫోన్లు చేసి ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేశారని.. లొంగకపోవడం వల్లే మండలిని రద్దు చేశారని ఆరోపించారు. శాసన మండలి లేకుంటే... ప్రత్యక్ష ఎన్నిక్లలో పోటీ చేసే స్తోమత లేని కులాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
'ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు' - tdp mlcs latest updates
రాజధాని బిల్లును బూచిగా చూపి మండలిని రద్దు చేయడం దురదృష్టకరమని తెదేపా ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రలోభాలకు లొంగలేదని ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
'ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు'
Last Updated : Jan 27, 2020, 7:33 PM IST