ఆ 2 బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపండి: తెదేపా నోటీసు - రాజధాని
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై.. తెదేపా పోరాటం కొనసాగిస్తోంది. వీటిని సెలక్ట్ కమిటీకి పంపాలంటూ మండలిలో ఛైర్మన్ కు నోటీసులు ఇచ్చింది.
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ప్రవేశపెట్టిన పరిపాలన వికేంద్రీకరణ - సమ్మిళిత అభివృద్ధి, సీఆర్డీఏ రద్దు బిల్లులను... మండలి సెలక్టు కమిటీకి పంపాలని తెలుగుదేశం పార్టీ కోరింది. బిల్లుల్లోని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నందున దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని తెదేపా ఎమ్మెల్సీలు కోరారు. శాసనమండలి కార్యదర్శి ద్వారా మండలి ఛైర్మన్‌కు నోటీసు పంపారు. బిల్లులోని వివిధ అంశాలపై సవరణలు ప్రతిపాదిస్తూ.. తెదేపా మరో రెండు నోటీసులు ఇచ్చింది. ఛైర్మన్ అనుమతితో మండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరుగుతోంది. తెదేపా ఇచ్చిన నోటీసుపై మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఛైర్మన్ దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయిస్తే.... మండలిలోని వివిధ పార్టీ సభ్యుల బలాబలాల ఆధారంగా సెలక్ట్ కమిటీ ఏర్పాటు అవుతుంది.
TAGGED:
రాజధాని