అయ్యన్నపాత్రుడితో చర్చకు సిద్ధమంటున్న మంత్రి జయరామ్.. ఏ తేదీన, ఎప్పుడు, ఎక్కడకు రావాలో చెబితే.. రావడానికి సిద్ధమని తెదేపా ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. కార్తీక్ నుంచి జయరామ్ కుమారుడికి అందిన ముడుపులను మీడియా ముఖంగా బట్టబయలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి తక్షణమే జయరామ్‌తో రాజీనామా చేయిస్తే... ప్రజలు కొంతైనా సంతోషిస్తారని హితవు పలికారు.
'మంత్రి జయరామ్... చర్చకు ఎప్పుడొస్తారు..?'
చర్చకు సిద్ధమన్న మంత్రి జయరామ్ ఎప్పుడు.. ఎక్కడికి వస్తారో చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అర్జునుడు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ స్కామ్‌లో నిందితులుగా ఉన్నవారి నుంచి మంత్రి బెంజ్ కారు తీసుకున్నారో.. లేదో చెప్పాలన్నారు.
గుమ్మనూరు యువసేన పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలో కార్తీక్ బహుమతిగా ఇచ్చిన బెంజ్ కారును ఈశ్వర్ తీసుకుంటున్న ఫొటో ఉందని వెల్లడించారు. ఈఎస్ఐ స్కామ్‌లో తనకు అడ్డు తగులుతున్నారని, కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఉదయలక్ష్మిపై మంత్రి జయరామ్ సీఎంవోకు ఫిర్యాదు చేయలేదా..? అని ప్రశ్నించారు. ఈఎస్ఐ స్కామ్‌లో ఏ-14గా ఉన్న ముద్దాయి ఇచ్చిన కారు తీసుకొని, అతన్ని రక్షించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని.. దీని ద్వారా తేలిపోయిందన్నారు. స్కామ్‌లు చేసేది వారే.. దోచుకునేది వారే.. నిందలు మాత్రం తెదేపా వాళ్లపై వేయడం వైకాపా వాళ్లకు అలవాటైందని మండిపడ్డారు.
ఇదీ చదవండీ... కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు