ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా మంత్రులపై మండలి ఛైర్మన్​కు తెదేపా ఎమ్మెల్సీల ఫిర్యాదు - tdp mlcs complaint to mandali chairman

శాసనమండలిలో వైకాపా సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్​కు తెదేపా ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలను విడుదల చేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. బాధ్యులైన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

tdp-mlcs-compliaint-to-mandali-chairma-on-ycp-members
వైకాపా మంత్రులపై మండలి ఛైర్మన్​కు తెదేపా ఎమ్మెల్సీల ఫిర్యాదు

By

Published : Jun 18, 2020, 6:29 PM IST

శాసన మండలిలో తమ సభ్యునిపై దాడి జరిగిందని మండలి చైర్మన్​కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ఎజెండా లేకపోయినా 18 మంది మంత్రులు సభకు వచ్చి దూషిస్తూ ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యారని పేర్కొన్నారు. మంత్రులు వెల్లంపల్లి, అనిల్ వ్యవహరించిన తీరు హేయమైందని విమర్శించారు.

మంత్రి వెల్లంపల్లి తమ సభ్యుడు బీదా రవిచంద్రపై దాడి చేశారని.. ఆత్మరక్షణ కోసం రవిచంద్ర ప్రతిఘటించారని తెలిపారు. మరికొంత మంది మంత్రులు లోకేశ్​పై దాడికి యత్నించారన్నారు. సభలో వీడియోలు పరిశీలించి బాధ్యులైన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. వీడియోలను బయటకు విడుదల చేసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details