ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కేంద్రమంత్రి తోమర్‍కి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా 2వేల500 కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకం బకాయిలు చెల్లించడం లేదని లేఖలో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి తోమర్‍కు తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ లేఖ - TDP MLC YVB Rajendra Prasad's letter to Union Minister Tomar
ఏపీ ప్రభుత్వ తీరుపై తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కేంద్రమంత్రి తోమర్‍కు లేఖ రాశారు. ఉపాధిహామీ పథకం బకాయిలు చెల్లించట్లేదని....కేంద్రం నిధులు రాష్ట్రప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుందని లేఖలో పేర్కొన్నారు.
తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్
2018-19కి సంబంధించిన ఉపాధి హామీ పథకం బకాయిల కోసం కేంద్రం 1900 కోట్లు రాష్ట్రానికి పంపిందని.., ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపించారు. ఉపాధి హామీ చట్టం కింద సిమెంట్ రోడ్లు వేసిన మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా