TDP MLC Paruchuri Ashok: రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఐఏఎస్‌లు ఎందుకిలా పాలకులు అడుగులకు మడుగులు వత్తుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీలు అందరూ కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారని మండిపడ్డారు. చట్టాలను ఏ రకంగా అమలుచేయాలో పాలకులకు చెప్పాల్సినవారే ఆ చట్టాలను కబళిస్తున్నవారికి సహకరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో తలబిరుసుగా మాట్లాడిన ఐఏఎస్‌లు.. ఇప్పుడెందుకు తల దించుకుంటున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఐదేళ్ల అధికారం ముందు 30 ఏళ్ల ప్రజాసేవ బానిస కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
"ఐదేళ్ల అధికారం ముందు.. 30ఏళ్ల ప్రజాసేవ బానిసకావడం బాధాకరం" - ఏపీ రాజకీయ వార్తలు
TDP MLC Paruchuri Ashok: రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన ఐఏఎస్ అధికారులు.. పాలకుల అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వంలో పనిచేసిన చీఫ్ సెక్రటరీలు అందరూ కోర్టు ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఐదేళ్ల అధికారం ముందు 30ఏళ్ల ప్రజాసేవ బానిసకావడం బాధాకరమన్నారు.
!["ఐదేళ్ల అధికారం ముందు.. 30ఏళ్ల ప్రజాసేవ బానిసకావడం బాధాకరం" TDP MLC Paruchuri Ashok](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14901693-363-14901693-1648819617340.jpg)
తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
TDP MLC Paruchuri Ashok: ఐఏఎస్, ఐపీఎస్‌లు తల్చుకుంటే ముఖ్యమంత్రులవుతారనీ.. ముఖ్యమంత్రులు ఐఏఎస్‌లు కాలేరని ఆక్షేపించారు. 8 మంది ఐఏఎస్ అధికారులు న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడటం.. రాష్ట్రప్రజలకే అవమానమన్నారు. చంద్రబాబు బస్సుపై రాళ్లు విసిరినప్పుడే సవాంగ్.. నిజమైన డీజీపీగా వ్యవహరించి ఉంటే నేడు అప్రాధాన్య పోస్టులో ఉండేవాడు కాదన్నారు.
ఇదీ చదవండి:ఏపీలో రాముడికి అవమానమంటూ సునీల్ దేవ్‌ధర్ ట్వీట్.. అదేం లేదన్న పోలీసులు.. అసలేం జరిగింది..?