వైకాపా ప్లీనరీని బూతుల పోటీ కార్యక్రమంలా.. ఎంటర్ టైన్మెంట్ షోలా మార్చారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కొడాలి నాని కంటే 420 ఇంకెవరూ లేరని ధ్వజమెత్తారు. మీడియా సంస్థలపై అవాకులు చవాకులు పేలిన కొడాలి నాని.. వాళ్లు కష్టపడి పైకొచ్చిన విషయం గుర్తించాలన్నారు. మరి, నాని ఏం పని చేసి అన్ని కోట్లు సంపాదించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కొడాలికి సవాల్ విసిరారు. రావి శోభానాద్రి దగ్గర ఆఫీస్ బాయ్‌గా పనిచేసి.. ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర కొడాలి నానిది అని ఆరోపించారు.
"వైకాపా ప్లీనరీని.. బూతుల పోటీ కార్యక్రమంలా మార్చారు"
మాజీ మంత్రి కొడాలినానిపై తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ మండిపడ్డారు. వైకాపా ప్లీనరీని బూతుల పోటీ కార్యక్రమంలా మర్చారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే కొడాలి నాని రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
MLC Manthena