వైకాపా పాలనలో క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విమర్శించారు. క్రీడాకారులంటే పేకాట ఆడేవారని మంత్రి అవంతి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా హయాంలో రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా నిలిపితే ...వైకాపా పేకాట హబ్‌గా మార్చిందని మండిపడ్డారు.
రాష్ట్ర క్రీడా మంత్రికి ఇవాళ క్రీడా దినోత్సవం అనే విషయం తెలియకపోవడం ఆయన శాఖపై ఎంత శ్రధ్ద వహిస్తున్నారో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుని విమర్శించడం తప్ప అవంతికి మరో ఆట కనపించడం లేదన్నారు. పేకాట, గుండాట ఆడేవారని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. క్రికెట్, పేకాట బెట్టింగులపై ఉన్న శ్రద్ధ యువత ఆడే క్రీడలపై లేకపోవడం బాధాకరమని తెలిపారు. 15 నెలల్లో రాష్ట్రంలో ఎన్ని క్రీడలు నిర్వహించారో అవంతి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.