కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసానిస్తున్నవారిని విమర్శిస్తున్నందుకు కొడాలి నాని కాస్త ఆలోచించాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. నారా లోకేశ్ ఓడిపోయినా.. సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటున్నారని తెలిపారు. అది తప్పేలా అవుతుందో చెప్పాలని కొడాలిని ప్రశ్నించారు. వైకాపా నేతలు ఓట్లు అడిగేందుకే బయటకు వస్తారా అని నిలదీశారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ పట్టించుకోకుండా ఇంటి నుంచి బయటకు రాకపోవడం దారుణమని మండిపడ్డారు.
సీఎం జగనా? లోకేశా? అని ప్రజలు అడుగుతున్నారు: మంతెన - తెదేపా నేత లోకేశ్
తెదేపా నేత లోకేశ్‌ను విమర్శించిన కొడాలి నానిపై ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసానిస్తున్న వారిని ఎద్దేవా చేయడం ఏమిటని ప్రశ్నించారు. నారా లోకేశ్ ఓడిపోయినా.. సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటున్నారని స్పష్టం చేశారు. వైకాపా నేతలు ఓట్లు అడిగేందుకే బయటకు వస్తారా అని నిలదీశారు.
ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ
ప్రతిపక్ష నేత లోకేశా.. చంద్రబాబా.. అని కొడాలి నాని అంటుంటే, సీఎం లోకేశా.. జగనా.. అని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. కష్టాల నుంచి రాష్ట్రం గట్టెక్కాలంటే చంద్రబాబు వల్లే అవుతుందని ప్రజలు అనుకుంటున్నట్లు తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కార్పొరేషన్ల ఏర్పాటు పేరుతో బీసీలను నయవంచన : కళా వెంకట్రావు
Last Updated : Oct 17, 2020, 8:24 AM IST