రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో వైకాపా ఉండదని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. వైకాపాను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రజలు 151 సీట్లు ఇస్తే.. రెండేళ్లు దాడులు, దౌర్జన్యాలు, కక్షసాధింపులు, తప్పుడు కేసులతో వృద్ధా చేశారని దుయ్యబట్టారు.
వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి తర్వాత జగన్ విదేశాలకు వెళ్లిపోతారన్న మంతెన.. తెదేపా ఎమ్మెల్యేలపై అవంతి అవాకులు, చవాకులు మాని అభివృద్ధి పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు జగన్ని నమ్మి మోసపోయినట్లు, భీమిలి ప్రజలు అవంతిని నమ్మి మోసపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే విశాఖలో అవంతి భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటామని.. ఇతర ప్రాంతాలకు పారిపోయినా వదిలేది లేదని హెచ్చరించారు.