ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అంబులెన్సుల అడ్డగింతపై సీఎం ఎందుకు స్పందించట్లేదు' - TDP MLC Manthena Comments on Ambulances issue

ఏపీ అంబులెన్సులను తెలంగాణ అడ్డుకోవటంపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడరని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ ప్రశ్నించారు. కేసీఆర్​తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ మంతెన
ఎమ్మెల్సీ మంతెన

By

Published : May 14, 2021, 12:45 PM IST

తెలంగాణ సరిహద్దుల్లో అక్కడి ప్రభుత్వం ఏపీ అంబులెన్సులను అడ్డుకుంటుంటే ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి ఎందుకు స్పందిచరని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నిలదీశారు. "రాష్ట్రంలో సరైన వైద్యం అందకే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. 10ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్​పై హక్కు ఉంటే ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత సీఎం ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి, స్వప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కుల్ని కేసీఆర్ కు జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు.

ఏపీ అంబులెన్స్ లు అడ్డుకోకుండా...వెంటనే తెలంగాణ సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో అంబులెన్స్ లను అనుమతించాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు

ABOUT THE AUTHOR

...view details