ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యవస్థల నాశనానికి అధికారుల సహకారం: దీపక్ రెడ్డి - panchayat elections in AP 2021

పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల తీరుపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు. నేతలకు అధికారులు వత్తాసు పలుకుతూ వ్యవస్థల నాశనానికి కారణమవుతున్నారని విమర్శించారు.

TDP MLC Deepak reddy
TDP MLC Deepak reddy

By

Published : Jan 23, 2021, 5:06 PM IST

ప్రభుత్వ అధికారులు, పాలకులు ప్రజల తలల పైకెక్కి ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మండిపడ్డారు. అధికారపక్షం 151 మంది ఎమ్మెల్యేలున్నారని విర్రవీగుతుంటే... వారికి అధికారులు వత్తాసు పలుకుతూ వ్యవస్థల నాశనానికి తమ వంతు సహకరిస్తున్నారని దుయ్యబట్టారు. పాలకుల అండ చూసుకుని తప్పుల మీద తప్పులు చేసిన అధికారులపై... ఎస్ఈసీ ఆరంభంలోనే చర్యలు తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగి ఉంటే ఇప్పుడు వారంతా ఎస్​ఈసీని ధిక్కరించే పరిస్థితి ఉండేది కాదని దీపక్ రెడ్డి అన్నారు. వ్యాక్సినేషన్​ను ఎన్నికలకు అడ్డుగా అధికారులు ఎలా చెబుతారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పరిశీలకులు, బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details