ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"రూపాయి జీతం సరే.. ఇంటికి 73లక్షలు కేటాయింపు ఎలా?"

వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. అమరావతిలో కట్టడాలూ లేవంటూ దుష్ప్రచారంతో రాష్ట్ర రాజధాని అమరావతికి అడ్రస్ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP mlc fire on CM Jagan over capital city amaravathi

By

Published : Nov 7, 2019, 4:08 PM IST

"రూపాయి జీతం సరే..ఇంటికి రూ.73లక్షలు కేటాయింపు ఎలా?"
ఐదు నెలల వైకాపా ప్రభుత్వ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శిచింది. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడారు. అమరావతిలో కట్టడాలూ లేవంటూ దుష్ప్రచారంతో రాష్ట్ర రాజధాని అమరావతికి అడ్రస్ లేకుండా చేశారని ఆరోపించారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా...ప్రభుత్వం స్పందించకపోవటాన్ని తప్పుబట్టారు. కేవలం రూపాయి జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి సొంత ఇంటి కిటీకీలు, తలుపులకు 73 లక్షల ప్రజాధనం ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ప్రభుత్వ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన 24 గంటల్లో 447 జీవో విడుదల ఉద్దేశ్యం ఏంటని నిలదీశారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కాపాడింది తెలుగుదేశం పార్టీనే అని అన్నారు. కేవలం 250 కోట్లు ఇచ్చి అంతా మేమే చేశామని చెప్పుకోవడం సబబు కాదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details