అధికార వైకాపా వ్యవస్థలను నాశనం చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఆరోపించారు. తెదేపా నేతలపై దాడులకు సంబంధించి ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన వాహనాలు సీజ్ చేయడం అనధికారమని కోర్టు గతంలోనే చెప్పిందన్న ఆయన.. ప్రభుత్వం కోర్టు నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడ్డారు.
దురుద్దేశంతోనే ప్రభాకర్‌రెడ్డిపై 40కి పైగా కేసులు పెట్టారని దీపక్‌రెడ్డి ధ్వజమెత్తారు. 40 ఎఫ్ఐఆర్లలో ప్రభాకర్‌రెడ్డి పేరు లేనప్పుడు ఎలా అరెస్టు చేశారని ప్రశ్నించారు.