ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్ నియంతలా పాలిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు ఎన్నిసార్లు సవాల్ విసిరినా ఏం చేయలేకపోయారని అన్నారు. సీఐడీని అడ్డం పెట్టుకుని నోటీసులు ఇప్పించారంటూ మండిపడ్డారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం చేసిన నిర్ణయాలను తప్పుగా ఆపాదిస్తారా అని ప్రశ్నించారు.
రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు: బుద్దా వెంకన్న - Budda Venkanna news
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఖండించారు. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థను సీఎం జగన్ నాశనం చేశారంటూ మండిపడ్డారు.
బుద్దా వెంకన్న
చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసు సహా అన్ని వ్యవస్థలను జగన్ నాశనం చేశారంటూ ఆరోపించారు. వైకాపా అరాచకాలకు భయపడే ఓట్లేసేందుకు ప్రజలు రాలేదన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారిపోయారు: లోకేశ్