కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు చేసే సాయంలోనూ ప్రభుత్వం మెలిక పెట్టడమేంటని... తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. కొవిడ్‌తో మృతిచెందిన వారి పిల్లలకు ఎలాంటి నిబంధనలు లేకుండా సాయం చేయాలని... సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు.
పది లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్న బుద్ధా... ప్రభుత్వ బీమా వర్తించిన వారి పిల్లలకు పది లక్షల సాయం వర్తించదని మెలిక పెట్టడం సరికాదన్నారు. పీడీఎస్ కార్డు ఉన్నా లేకపోయినా అనాథలైన పిల్లలందరికీ ఏ ప్రభుత్వం వచ్చినా సాయం అందేలా ప్రభుత్వం దత్తత తీసుకోవాలని లేఖలో కోరారు.