ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పరిపాలన చేతకాక.. ప్రతిపక్షాలపై విమర్శలు: బుద్ధా వెంకన్న - విశాఖ రాంకీ ప్రమాదంపై బుద్ధా వెంకన్న కామెంట్స్

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో అడుగుపెట్టాకే ప్రమాదాలు పెరిగాయని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. విశాఖలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై కేంద్రం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ రాంకీ పరిశ్రమ ప్రమాద బాధితులకు కోటి రూపాయలు ఎందుకు ఇప్పించరని ప్రశ్నించారు. పరిఫాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

By

Published : Jul 15, 2020, 6:36 PM IST

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో అడుగుపెట్టాకే ఆ ప్రాంతం ప్రమాదాలకు నెలవుగా మారిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. విశాఖను విజయసాయిరెడ్డి వదిలి వెళ్తేకాని ప్రజలు ప్రశాంతంగా బతకలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకు విజయసాయిరెడ్డి ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు. తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎంపీకి సంబంధించిన సంస్థలో వ్యక్తి చనిపోతే కోటి రూపాయలు ఎందుకు ఇప్పించరని బుద్ధా వెంకన్న నిలదీశారు.

పాలన చేతకాక ప్రతిపక్షంపై విమర్శలతో కాలం వెల్లబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదాల్లో విజయసాయిరెడ్డి పాత్ర ఉందన్న బుద్ధా వెంకన్న... పరిశ్రమల చుట్టుపక్కల ఉన్న స్థలాలను ఖాళీ చేయించి కబ్జా చేసే కుట్రలో భాగంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా విశాఖలోనే ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయనే దానిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖకు విజయసాయిని వైకాపా ఇన్ఛార్జిగా నియమించిన తర్వాతే ప్రమాదాలు జరుగుతున్నాయనే దానిపై కేంద్రం విచారణ జరిపించాలన్నారు.

ఇదీ చదవండి :రాష్ట్రంలో కొత్త జిల్లాలు... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

ABOUT THE AUTHOR

...view details