ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మీరిచ్చే స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం ఉందా..?'

రాష్ట్ర ప్రభుత్వం తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను నిరుపయోగంగా వదిలేస్తుందని తెదేపా ఎమ్మెల్సీ ఆశోక్​ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించిన ఆయన.. కరోనా వల్ల వెనక్కి తగ్గామని.. లేకుంటే ఉద్యమం చేసే వాళ్లమని అన్నారు.

'మీరిచ్చే ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టే అవకాశం ఉందా..?'
'మీరిచ్చే ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టే అవకాశం ఉందా..?'

By

Published : Jul 6, 2020, 12:28 PM IST

తెలుగుదేశం హయాంలో నాణ్యతతో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటని ఆ పార్టీ నేత అశోక్‌బాబు ప్రశ్నించారు. 151 స్థానాలు వచ్చాయని వైకాపా నేతలు ఎగిరెగిరి పడుతున్నారని.. ఇదంతా వాపు మాత్రమేనని బలుపు కాదని తెలుసుకోవాలని హితవు పలికారు. మొత్తం... పూర్తయిన ఇళ్లను 15 నెలలుగా నిరుపయోగంగా ఉంచడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే ఖాళీ స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించిన ఆయన.. కరోనా వల్ల వెనక్కి తగ్గామని.. లేకుంటే ఉద్యమం చేసే వాళ్లమని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్మాణమైన 6 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని అశోక్​బాబు డిమాండ్‌ చేశారు. లేకుంటే... పేదవాడి ఆగ్రహం ఎలా ఉంటుందో త్వరలో తెలుస్తుందని అశోక్‌బాబు అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details