రాష్ట్రంలో పోలీసులు ఖాకీ యూనిఫామ్ తీసేసి వైకాపా దుస్తులు ధరించటం మంచిదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవాచేశారు. వైకాపా అరాచకాలపై హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. 12 జడ్పీటీసీలు, 470 ఎంపీటీసీల్లో ఎన్నికల రీషెడ్యూల్ కోరుతూ వ్యాజ్యం వేశామన్నారు. నామినేషన్లు వేసేటప్పుడు.. పరిశీలన సమయంలోనూ వైకాపా నేతలు, కార్యకర్తలు పత్రాలు చించేసే దుస్థితి నెలకొందని అశోక్‌బాబు మండిపడ్డారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తెదేపా నేతలు మాచర్ల వెళ్లారని హోంమంత్రి అబద్దాలు చెప్తున్నారన్న ఆయన.. తాము పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు నిరూపిస్తే.. హోంమంత్రి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు.
' పోలీసులూ యూనిఫామ్ తీసేసి వైకాపా దుస్తులు ధరించండి' - వైకాపా ప్రభుత్వంపై అశోక్ బాబు ఆగ్రహం
స్థానిక ఎన్నికల్లో వైకాపా చేస్తున్న దౌర్జన్యాలపై హైకోర్టులో పిటిషన్లు వేశామని.. తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. ఎన్నికల రీషెడ్యూల్ కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశామని తెలిపారు.
అశోక్ బాబు