వాహనమిత్ర పథకానికి ఇచ్చేది తక్కువ.. ఆర్భాటం ఎక్కువని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. ఓనర్లకు మాత్రమే డబ్బులిస్తే వాహనాలు అద్దెకు నడుపుకునే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మందికి వాహనమిత్ర పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
'వారి పత్రికకు ప్రకటనల కోసమే పథకాలు ప్రారంభిస్తున్నట్లుంది' - వైకాపా ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శల వార్తలు
సాక్షి పత్రికకు ప్రకటనలు ఇచ్చుకునేందుకు రాష్ట్రంలో పథకాలను ప్రారంభిస్తున్నట్లు ఉందని.. తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. వాహనమిత్ర పథకానికి ఇచ్చేది తక్కువ, ఆర్భాటం ఎక్కువని ఆయన విమర్శించారు.
!['వారి పత్రికకు ప్రకటనల కోసమే పథకాలు ప్రారంభిస్తున్నట్లుంది' tdp mlc ashok babu criticises ycp government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7476628-170-7476628-1591280087105.jpg)
అశోక్ బాబు, తెదేపా ఎమ్మెల్సీ
సాక్షి పత్రికకు ప్రకటనలు ఇచ్చుకునేందుకే పథకాలు ప్రారంభిస్తున్నట్లుగా ఉందని అశోక్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలోని వాహనాల ద్వారా ప్రభుత్వానికి 800 నుంచి 900 కోట్ల రూపాయలు వస్తుంటే.. వారికి ఇస్తుంది కేవలం 262 కోట్లు మాత్రమేనని విమర్శించారు.
ఇవీ చదవండి.. 'ఇలాగే మరెన్నో ఏళ్లు మీ గాత్రంతో అలరించండి'