ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రేషన్​ షాపుల్లో ఇచ్చే బియ్యానికీ.. కులాల వారీగా లెక్కలు చెప్తారా..?'

కాపు సంక్షేమంపై మంత్రి కన్నబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెదేపా ఎమ్మెల్సీ అశోక్​ బాబు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా బడ్జెట్​ విడదీసే నీచ చరిత్రకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. కాపు సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని అశోక్​ బాబు డిమాండ్​ చేశారు.

'రేషన్​ షాపుల్లో ఇచ్చే బియ్యానికీ.. కులాల వారీగా లెక్కలు చెప్తారా..?'
'రేషన్​ షాపుల్లో ఇచ్చే బియ్యానికీ.. కులాల వారీగా లెక్కలు చెప్తారా..?'

By

Published : Jun 27, 2020, 8:00 PM IST

కులాల వారీగా బడ్జెట్ విడదీసిన నీచ చరిత్రకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల వ్యవహార శైలి చూస్తుంటే రేషన్​ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని కూడా కులాల వారీగా లెక్కేసి చెప్పేలా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాపు సామాజికి వర్గానికి ఎంతో మేలు చేసిందని మంత్రి కన్నబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాపుల తరఫున మాట్లాడే నైతిక హక్కు మంత్రికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ ప్రభుత్వ పథకాలైనా.. ఆయా కార్పొరేషన్ల ద్వారానే అందిస్తామని చెబుతూనే.. అన్ని సంక్షేమ పథకాల ద్వారా కాపులకు రూ.4 వేల కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారని అశోక్​ బాబు మండిపడ్డారు. ఈ పథకాల్లో అమ్మఒడి, రైతు భరోసాలను ఎందుకు కలపలేదని ప్రశ్నించారు. తెదేపా, వైకాపా హయాంలో కాపు సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేయాలని అశోక్​ బాబు డిమాండ్​ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details