విద్యుత్ ఛార్జీలు పెంచనని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రెండున్నరేళ్ల కాలంలో నాలుగుసార్లు ప్రజలపై రూ.9వేల కోట్ల భారం మోపారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకారం రోజు హామీ ఇచ్చి మాట తప్పారని ఓ ప్రకటనలో అన్నారు. పన్నులకు తోడు విద్యుత్ బిల్లుల భారం సామాన్యుడికి సమస్యగా మారాయని.. మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం అభివృద్ధి చేసిన సౌర, పవన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి దెబ్బతీశారని ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు రద్దు చేయటం వల్లే విద్యుత్ కోతలని విమర్శించారు.
MLA Yelluri: 'ప్రజలపై వైకాపా రూ.9వేల కోట్ల భారం మోపుతోంది' - ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తాజా వార్తలు
ట్రూ అప్ విధానంలో ప్రభుత్వం దొడ్డిదారిన ప్రజలపై 3,660కోట్ల విద్యుత్ భారం మొపి ఛార్జీలు రెట్టింపు చేయటం దుర్మార్గమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మండిపడ్డారు. నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే.. ప్రజా ఆగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
tdp MLA yelluri Sambashivarao
కరోనా తీవ్రతలో అప్రకటితంగా స్లాబ్ రేట్లు మార్చి రూ.6వేల కోట్ల భారం మోపారని ధ్వజమెత్తారు. విద్యుత్ సర్ ఛార్జీల రూపేణా ఇప్పటివరకూ రూ.2600కోట్ల వరకూ భారం మోపారని మండిపడ్డారు. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో ప్రతి మూడు నెలలకు ప్రజల నుంచి పెరిగిన విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని వసూలు చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండీ..ATCHENNAIDU: రైతులకు ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా?: అచ్చెన్నాయుడు
TAGGED:
MLA yelluri Sambashivarao