గన్నవరం తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపాలో చేరే అవకాశం ఉంది. వైకాపాలో చేరేందుకు వంశీ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి... జగన్ పార్టీలో చేరేందుకు వల్లభనేని వంశీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ సీఎం జగన్‌తో భేటీ అయిన వంశీ... తన రాజకీయ భవిష్యత్‌పై జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా సిద్ధమేనని చెప్పినట్లు సమాచారం. వైకాపా బలోపేతానికి కృషి చేస్తానని సీఎంతో చెప్పిన ఆయన.. దీపావళి తర్వాత వైకాపాలో చేరే అవకాశం ఉందని వైకాపా వర్గాలు అంటున్నాయి.
వైకాపాలోకి వల్లభనేని వంశీ..? - vallabhaneni vamsi latest news
గన్నవరం తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైకాపాలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ సీఎం జగన్‌తో భేటీ అయిన ఆయన ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. దీపావళి అనంతరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైకాపాలో చేరే అవకాశం ఉంది.
వైకాపాలోకి వల్లభనేని వంశీ..?