ఎస్సీలపై దాడులకు రాష్ట్రం అడ్డాగా మారిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు, తదనంతర పరిణామాల్లో ఎస్సీలపై నిరంతర దాడులు కొనసాగుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్కు ఆయన లేఖ రాశారు.
ఎస్సీలపై దాడులకు రాష్ట్రం అడ్డాగా మారింది: వర్ల రామయ్య - assault in andhrapradhesh
జాతీయ ఎస్సీ కమిషన్కు తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనలకు కారకులైన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని కోరారు.
తూర్పుగోదావరి జిల్లా ఇల్లపల్లి పంచాయతీలో తెదేపా ఎస్సీ నేత రాఘవ కుటుంబంపై వైకాపా నేతలు దాడి చేశారని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, బాధిత వర్గానికి చెందిన 18మందిపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. వైకాపా నేతలతో కలిసి కొందరు పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుండటంతో ఎస్సీ సామాజిక వర్గానికి రక్షణ లేకుండా పోతోందని లేఖలో ఫిర్యాదు చేశారు. దాడి ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని వర్ల రామయ్య కోరారు.
ఇదీచదవండి...