ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళలకు జగన్ క్షమాపణలు చెప్పాలి: నిమ్మల రామానాయుడు - వైఎస్​ఆర్ చేయూత పథకం

వైఎస్​ఆర్ చేయూత పథకం పేరుతో మహిళలను సీఎం జగన్ మోసగించారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఎన్నికల వేళ నెలకు 3వేల పింఛన్​ ఇస్తానని చెప్పి...ఇప్పుడేమో నాలుగేళ్లలో 75వేలు ఇస్తామని చెప్పడం వారిని మోసగించడం కాదా అని ప్రశ్నించారు.

tdp mla Nimmala Ramanaidu
tdp mla Nimmala Ramanaidu

By

Published : Aug 12, 2020, 2:52 PM IST

45 ఏళ్లు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నెలకు 3వేల పింఛన్ ఇస్తానని జగన్ చెప్పారని... ఇప్పుడేదో వైఎస్​ఆర్ చేయూత పథకం కింద 75 వేలు ఇస్తానని చెప్పడం వారిని మోసగించడం కాదా..? అని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ మాటతప్పి, మడమ తిప్పడం వల్లే ఇప్పుడు ఆ మొత్తాన్ని 75 వేల రూపాయలకు పరిమితం చేశారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఒక్కో మహిళ లక్షా 5 వేల రూపాయల వరకు నష్టపోతోందన్నారు. ఆందుకే.. జగన్ చేసిన తప్పును ఒప్పుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల నిధులను జగన్ దారి మళ్లించారని ఆక్షేపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ లో ప్రభుత్వం రూపాయి కూడా ఆయా వర్గాలకు ఖర్చు చేయలేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details