ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మంత్రి బాలినేనిని కలిశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా' - tdp mla anagani satyaprasad news

తాను పార్టీ మారుతానని వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి బాలినేనిని కలిసినట్లు ఎవరైనా నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. తమలోనూ తప్పుడు ప్రచారం చేసేవాళ్లు ఉన్నారన్న ఆయన.. వాటిని అరికట్టాల్సిన బాధ్యత పార్టీపై ఉందని స్పష్టం చేశారు.

'మంత్రి బాలినేనిని కలిశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా'
'మంత్రి బాలినేనిని కలిశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా'

By

Published : Jun 1, 2020, 5:36 PM IST

తాను పార్టీ మారుతున్నానని వస్తోన్న ప్రచారాన్ని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్​ తీవ్రంగా ఖండించారు. ఏడాదిలో మూడుసార్లు ఇలాంటి పుకార్లు లేవదీశారని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ సమయాన్ని తనపై దుష్ప్రచారానికి వాడుతున్నారని అన్నారు. మార్చి 20 నుంచి మొన్నటివరకు తాను రాష్ట్రంలో లేనని అనగాని స్పష్టం చేశారు. ఈ సమయంలో నేను ఏపీలో ఉన్నట్లు గానీ లేదా మంత్రి బాలినేనిని కలిసినట్లు గానీ నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.

మహానాడులో తానూ పాల్గొన్నానన్న అనగాని.. పార్టీ మారమని ఎందరో అడుగుతారని దానికే వెళ్లినట్లు కాదని తెలిపారు. చంద్రబాబుకు అండగా ఉంటున్నాననే కొందరు కుట్ర చేస్తున్నారని అన్నారు. తమలోనూ తప్పుడు ప్రచారం చేసేవాళ్లు ఉన్నారన్న ఆయన.. వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన బాధ్యత పార్టీ మీద ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details